Big News : భూమా అఖిలప్రియకు 14 రోజులు రిమాండ్‌.. జైలుకు తరలింపు

-

మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజలు రిమాండ్ విధించింది. అఖిలప్రియతో పాటు భార్గవ రామ్‌కు సైతం రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారు. ఈ ఘర్షణల్లో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో భూమా అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదు అయింది.

వాస్తవానికి అఖిలప్రియకూ, ఏవీ సుబ్బారెడ్డికీ మధ్య ఎప్పటి నుంచో పోరు నడుస్తోంది. అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ఆమె అనుమానిస్తున్నారు. వాటి వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెరిగిన గ్యాప్ కాస్తా దాడుల వరకూ వెళ్లింది. దీంతో తాజా ఘటనలు చోటు చేసుకున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version