ఒకప్పుడు హీరోయిన్లు గా రాణించి, ఇప్పుడు మళ్ళీ తెర మీద కనపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు మాజీ హీరోయిన్లు, వారిలో జ్యోతిక, స్నేహ, భూమిక, వంటి మాజీ హీరోయిన్లు ఇప్పుడు తెర మీద కనపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా పాత్రకు ప్రాధాన్యత ఉంటె నటించడానికి సిద్దమవుతున్నారు. స్నేహ ఇప్పటికే పలు సినిమాల్లో ఆ పాత్రలు విజయవంతంగా చేసింది.
జ్యోతిక కూడా తమిళంలో అడపాదడపా కనపడే ప్రయత్నాలు చేస్తుంది. భూమిక కూడా ఎంసియె నుంచి తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. యుటర్న్, సవ్యసాచి, తాజాగా బాలకృష్ణ హీరో గా నటించిన రూలర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఎంసియే సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరిగింది. ఇక నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమె అలాంటి పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది.
తాజాగా రూలర్ సినిమాలో నటిగా మంచి మార్కులే కొట్టేసింది భూమిక. ఈ నేపధ్యంలో ఒక కీలక ప్రకటన చేసి దర్శక నిర్మాతలకు ఒక సంకేతం ఇచ్చేసింది. తాజాగా మాట్లాడుతూ… పాత్ర డిమాండ్ చేస్తే తాను బోల్డ్ సీన్లలో నటించడానికి కూడా సిద్దంగా ఉన్నాను అంటూ ప్రకటించింది. వాస్తవానికి భూమిక హీరోయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. మరి ఆమె నుంచి బోల్డ్ సీన్లను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.