ధరణి ద్వారా అనేక భూములను కొల్లగొట్టారు : భువనగిరి ఎమ్మెల్యే

-

హరీష్ రావు, కేటిఆర్ లు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టాలని చూస్తున్నారు. చెరువులను,కుంటలను కబ్జాలు చేసింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ధరణి ద్వారా అనేక భూములను కొల్లగొట్టార. సీఎం రేవంత్ హైడ్రా ఏర్పాటు చేసి వాటిని కాపాడుతున్నాడు. ప్రతి విషయాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు, కేటిఆర్ లు సీఎం రేవంత్ రెడ్డిని పని గట్టుకొని బాధనాం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ పడి పోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కి వస్తున్న ఇమేజ్ తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెరా లేదు. కాంగ్రెస్ రేరాను తీసుకొచ్చింది. రెరా ట్రిబ్యూనల్ ఏర్పాటు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ని నియమించింది కాంగ్రెస్బీ. ఆర్ఎస్ ప్రభుత్వం అనుకూలమైన వారికోసం అడ్డగోలుగా రేట్లు పెంచారు అని భువనగిరి ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version