తీన్మార్ మల్లన్న పై పార్టీ చర్యలు తీసుకుంటుంది : ఎమ్మెల్యే అనిల్ కుమార్

-

తీన్మార్ మల్లన్న పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. నల్లగొండ లో మేము డబ్బులు ఖర్చు పెట్టి తీన్మార్ మల్లన్నను గెలిపించాము. కానీ ఇప్పుడు ఆయన పరిధి దాటి మాట్లాడుతుండు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఒకే కమ్యూనిటీ ని టార్గెట్ చేసి మాట్లాడుతుండు.ఆయన పై పార్టీ చర్యలు తీసుకుంటుంది అని అన్నారు.

అలాగే ఎమ్మెల్యేల రహస్య సమావేశానికి నాకు ఫోన్ రాలేదు. ఆ మీటింగ్ కేవలం చిన్న పార్టీకోసం అనిరుద్ రెడ్డి పిలిచడాని సమాచారం ఉంది. ఇక రింగ్ రోడ్డు ఏ విధంగా డవలప్ అయిందో మూసి రివర్ ఫ్రంట్ ద్వారా మూసి లో స్వచ్ఛమైన నీరు పారబోతుంది. ఫోర్త్ సిటీ శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయిస్తుంది. కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరం. ఈ విషయం పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు చేతులు కట్టుకొని కూర్చున్నారా అని ప్రశ్నించారు అనిల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version