రాహుల్ ఫోటో మార్ఫింగ్.. ఆ స్టేట్ బీజేపీ చీఫ్‌పై భువనగిరి ఎంపీ ఫిర్యాదు

-

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోటో మార్ఫింగ్ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ క్రమంలోనే బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డిలు హయత్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ గుజరాత్ ‘ఎక్స్’ ఖాతాలో మార్ఫింగ్ ఫోటోను పోస్టు చేసి రాహుల్ గాంధీ నల్లధనం కలిగి ఉన్నారంటూ దుష్ర్పచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీఎన్ఎస్, ఐటీ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే పోలీసులను కోరారు. ఇదిలాఉండగా, ఎంపీ చామల, ఎమ్మెల్యే మల్‌రెడ్డిలు పీఎస్‌కు వచ్చిన సందర్భంగా ఆ దారిలో పోలీసులు ఇతర వాహనాలను నిలిపవేశారు. దీంతో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ జాంలో చిక్కుకుంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై వాహనదారులు సీరియస్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news