కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క

-

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎంరేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క  అన్నారు. తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో మహిళా యువ
వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని మా ప్రభుత్వము ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తుందని తెలిపారు.

seethakka
seethakka

మహిళా సంఘాలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మహిళా సమాఖ్యల వ్యాపార వృద్ధి కోసం శిల్పారామంలో ఇందిరా మహిళ శక్తి బజార్ ను ప్రారంభించామని, ఇక్కడ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో స్టార్ట్ అప్ కంపెనీల సేల్స్ ను ఈరోజు ప్రారంభించామని గుర్తు చేశారు. మహిళ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, మండల స్థాయి నుంచి హైదరాబాద్ వరకు స్వేచ్ఛగా మార్కెటింగ్ చేసుకునే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news