నల్లగొండ జిల్లా కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నల్లగొండ జిల్లా ప్రజలను, ముక్యంగా రైతులను మోసం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వమన్నారు. Slbc కి కేటాయించిన నీటిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని.. 246జీవో ను వెంటనే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా slbc కి సంబంధించిన dpr ను సమర్పించలేదు… గ్రావిటీ ద్వారా నీరు వచ్చే slbc ని పూర్తి చేయకుండా… లక్షలు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేశారని మండిపడ్డారు.
కృష్ణా నది నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకు 8 నుండి 11 tmc ల నీటిని అక్రమంగా తరలించుకు పోతున్నారు..AP నీటి దోపిడీని అడ్డుకోకపోతే నిర్మాణంలో ఉన్న slbc నిరుపయోగంగా మారుతుందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ నోరుమీదపడం లేదని ఆగ్రహించారు. ఫ్లోరైడ్ ను రూపు మాపింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. కృష్ణా నది కేటాయంపులను వాడుకునే పరిస్థితి లో ప్రభుత్వం లేదని.. త్వరలో సీఎం కేసీఆర్ తీసుకుంటానని ప్రకటించారు. కేసీఆర్ తో అన్ని విషయాలను చర్చిస్తా..దీనిపై సీఎం స్పందించకపోతే రక్తపాతం తప్పదని హెచ్చరించారు.