సైకిల్ ‘గేమ్’: అంబటిని సైడ్ చేస్తారా?

-

ప్రతిపక్ష పార్టీ అన్నాక…అధికార పార్టీ చేసి తప్పులని ఎత్తిచూపడం..ఆ పార్టీపై విమర్శలు చేయడం సహజమే…ఏదొకవిధంగా అధికార పార్టీని దెబ్బకొట్టి మళ్ళీ అధికారం దక్కించుకునే దిశగా వెళ్లడమే ప్రతిపక్ష పార్టీ టార్గెట్. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ అనేక వ్యూహాలతో ముందుకెళుతూ ఉంటుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు..ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ కూడా అలాగే ముందుకెళుతుంది…అధికార వైసీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది..ఇక టీడీపీ వ్యూహాలని తిప్పికొట్టేందుకు వైసీపీ కూడా ప్రయత్నిస్తుంది.

అయితే టీడీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెళుతుంది…పార్టీ పరంగానే కాకుండా నాయకులు పరంగా కూడా టార్గెట్ చేసి ముందుకెళుతుంది. ముఖ్యంగా కొందరు మంత్రులని టార్గెట్ చేసుకుని టీడీపీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది…మంత్రుల పరంగా టార్గెట్ చేసి, వారిని రాజకీయంగా మరింత ఇరుకున పెట్టి, చివరికి వైసీపీకే చెక్ పెట్టే విధంగా ప్లాన్ చేస్త్సున్నారు.

పాత మంత్రివర్గం ఉన్నప్పుడు టీడీపీ..కొందరు మంత్రులని ప్రత్యేకంగా టార్గెట్ చేసిందనే చెప్పాలి..కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారిని గట్టిగానే టార్గెట్ చేసింది…ఇక సందర్భం బట్టి ఒకోసారి ఒకో మంత్రిని టార్గెట్ చేసి వారి అవినీతి, అక్రమాల ఆరోపణలు చేసింది. అలాగే వారిని సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ చేయడం చేసింది. అయితే ఇప్పుడు కొత్త మంత్రివర్గంపై కూడా టీడీపీ ఫోకస్ పెట్టింది…ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబుని గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది…ఆ మధ్య రాంబాబు ఎలాంటి వివాదాల్లో చిక్కుకున్నారో అందరికీ తెలిసిందే..ఇప్పుడే అదే అంశాన్ని టార్గెట్ చేసి టీడీపీ…అంబటిని ట్రోల్ చేస్తుంది.

తాజాగా అయితే అంబటి…ఓ మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం మహిళా జర్నలిస్ట్‌ వాట్సాస్‌ మెసేజ్‌ చేశారని, ఇంటర్వ్యూ ఇస్తే నాకేమిస్తావంటూ అంబటి రిప్లై ఇచ్చారని, త్వరలో ఈ వివరాలు ప్రపంచానికి తెలుస్తాయని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. అలాగే అంబటి పదవి పోవడం గ్యారెంటీ అంటున్నారు…మొత్తానికి అంబటి పదవి పోయేవరకు టీడీపీ నిద్రపోయేలా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version