తెలంగాణలో బీజేపీ టార్గెట్ మొత్తం కేసీఆర్ పైనే ఉంది…ఈ సారి ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు…గత రెండేళ్ల నుంచి ఓ రేంజ్ లో కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ముందుకెళుతున్నారు…పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం బీజేపీకి బాగా కలిసొస్తుంది..అలాగే ఉపఎన్నికల్లో గెలవడం పెద్ద అడ్వాంటేజ్ గా మారింది..ఇక తామే, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని బీజేపీ చెబుతుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయం నడుపుతుంది.
తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా బీజేపీ దూసుకెళుతుంది…రాజకీయంగా కేసీఆర్ కు ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తుంది…ఇప్పటికే ఆయన చాలా అవినీతి చేశారని, త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇలా ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజీపీ వదులుకోవడం లేదు. అయితే తాజాగా కేఏ పాల్ రూపంలో బీజేపీకి ఒక అవకాశం దొరికినట్లు కనిపిస్తోంది. ఇటీవల పాల్..తెలంగాణ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే…కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ మధ్య పాల్ పై ఓ టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేశారు.
అయితే పాల్ రాజకీయాలని ఎవరు పెద్దగా పట్టించుకోరు…కానీ ఈ దాడి తర్వాత సీన్ మారింది..తనపై దాడి చేసిన విషయం గురించి కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు..ఈ క్రమంలోనే పాల్..నేరుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలిసి జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు. అసలు డైరక్ట్ గా షా అపాయింట్మెంట్ పాల్ కు దొరకడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పాల్ రూపంలో కమలం పార్టీ ఏమన్నా రాజకీయ గేమ్ మొదలు పెట్టబోతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తుంది..పాల్ ద్వారా క్రిస్టియానిటీ ఓటింగ్ ఏమన్నా రాబట్టాలని చూస్తున్నారో తెలియడం లేదు…మరి చూడాలి కమలం గేమ్ లో పాల్ పాలిటిక్స్ ఉంటాయో లేదో.