UAE: యూఏఈ ప్రెసిడెంట్ గా షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఎన్నిక

-

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ జాయేద్ ఆల్ నెహ్యాన్ ఎన్నికయ్యారు. శుక్రవారం యూఏఈ ప్రెసిడెంట్ గా ఉన్న షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యం అయింది. అయితే యూఏఈ రాజ్యాంగం ప్రకారం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 30 రోజుల గడువు ఉన్నా… తదుపరి అధ్యక్షుడిని వెంటనే ఎన్నుకున్నారు. ఈ రోజు సమావేశం అయిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ కొత్త పాలకుడిని ఎన్నుకుంది. 

ప్రస్తుతం షేక్ మహ్మద్ జాయేద్ యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ కు డిఫ్యూటీ సుప్రీం కమాండర్చీ ఉన్నారు. యూఏఈ ఆర్మీ వ్యూహాత్మకంగా, శిక్షణ, ప్లానింగ్, సైనిక పరంగా ఎదిగేందుకు షేక్ జాయేద్ చాలా కీలకంగా వ్యవహారించారు. 2005లో నుంచి యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ కు ఈయన చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. యూఏఈ ఆర్మీ ప్రపంచ స్థాయి ఆర్మీాగా ఎదిగేందుకు కృషి చేశారు. కాగా… షేక్ ఖలీఫా మరణం పట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. 40 రోజుల పాటు యూఏఈలో సంతాప దినాలు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version