ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది.ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవ్వగా.. నేటితో(బుధవారం)తో గడువు ముగియనుంది. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేటి రాత్రిలోగా అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అదేవిధంగా తమ అప్లికేషన్‌లోని వివరాల్లో ఏవైనా తప్పులుంటే నవంబర్ 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
అప్లై చేసే టైంలో ఏమైనా సమస్యలు వస్తే 7032901383, 9000756178 నంబర్లను సంప్రదించాలన్నారు. కాగా మంగళవారం రాత్రి వరకూ 2,07,765 దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ జి. రమేష్ తెలిపారు.పేపర్-1కు 61,930 మంది, పేపర్-2కు 1,28,730 మంది, రెండు పేపర్లకు కలిపి 17,104 మంది అప్లై చేసుకున్నట్లు సమాచారం.ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి.డిసెంబర్ 26వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి.