ఏపీ ప్రజలకు శుభవార్త..వారందరికీ ఇళ్ళ స్ధలాలు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య పంపిణీ చేసిన స్ధలాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని తాజాగా అసెంబ్లీ ప్రకటన చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. లబ్ధిదారులు ఎక్కడున్నారో గుర్తించి వారికి పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొలుసు పార్థసారథి. PMAY 2.0 కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడతో మాట్లాడతామన్నారు. హౌసింగ్ కమిటీ కి సంబంధించి విచారణ జరుగుతోందన్నారు. వివక్షతో ఇళ్ళ స్ధలాల కేటాయింపు పై చర్యలు ఉంటాయని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి.
ఇక అటు 2027 గోదావరి పుష్కరాలపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రివ్యూ చేసుకుంటామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. 75% దేవాదాయ శాఖ, 25% బుద్దవరపు ఛారిటీ ద్వారా గోదావరి హారతి నిర్వహిస్తున్నామని తెలిపారు.