Big boss 7: బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే కంటెస్టెంట్లు వీళ్లే..!

-

బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటికీ తెలుగులో ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో ఇప్పుడు ఏడవ సీజన్ కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి స్టార్ మా లో మొదలు కాబోతున్న ఈ షో కి ఇప్పటినుంచే కంటెంట్లను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కూడా కొంతమంది కంటెస్టెంట్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి వారు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్ట్ గా రానా రాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బిగ్ బాస్ నిర్వాహకులు.. ఈలోపే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లను కూడా వైరల్ అవుతున్నాయి . ఆ లిస్టులోకి టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దుర్గారావు పేరు వినిపిస్తోంది. టిక్ టాక్ పుణ్యమా అని ఫేమస్ అయినా దుర్గారావు అటు జబర్దస్త్ షోలో కూడా సందడి చేస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే అతడికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అతనికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈయన తో పాటూ టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి ఆ తర్వాత యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్గా దూసుకుపోతున్న దీపిక పిల్లి, నయనా పావని , జబర్దస్త్ వర్ష, పవిత్ర , వైష్ణవి చైతన్య పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరు అందరూ కూడా తమ అంద చెందాలతోనే కాదు కామెడీతో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మరి వీళ్ళు నిజంగా బిగ్ బాస్ కి వెళ్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version