Big Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ సేఫ్..డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్..రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ పదో వారం తమ గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. తొమ్మిదో వారం హౌజ్ నుంచి హమీద ఎలిమినేట్ కాగా, మిగిలిన కంటెస్టెంట్స్ అలర్ట్ అయ్యారు.

సోమవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ నామినేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఫిమేల్ టైటిల్ విన్నర్ అనే విషయమై అఖిల్ వర్సెస్ అరియానా గ్లోరీ అనే సీన్ క్రియేట్ అయింది. కొద్ది సేపు వీరిరువురి మధ్య ఫైట్ జరిగింది. మరో వైపున బటన్స్ గురించీ అరియానా, అషురెడ్డి మధ్య గొడవ జరిగింది. శివ వర్సెస్ అషురెడ్డి ఫైట్ కూడా ఇంకా కొనసాగు..తోంది. చాలా సార్లు శివ తప్పులు చేశాడని ఆర్గుమెంట్స్ కొద్ది సేపు నడిచాయి.

ఇక మండే ఎపిసోడ్ లో పర్ఫార్మర్ గా మరోసారి బిందు మాధవి నిలిచింది. పూర్తిగా మిత్రా శర్మను బిందు మాధవి ఇమిటేట్ చేసింది. నామినేషన్స్ నుంచి ఈ సారి నటరాజ్ మాస్టర్ సేఫ్ అయిపోయారు. ఆయన్ను ఎవరూ నామినేట్ చేయలేదు. దాంతో నటరాజ్ మాస్టర్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉండిపోతాడనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

ఇక ఇద్దరూ ఫిమేల్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అషురెడ్డి, మిత్రా శర్మ ..ఆ ఇద్దరూ కంటెస్టెంట్స్ అని అంటున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version