Big Boss OTT Telugu: చిన్న ‘నాటి’ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన ఇంటి సభ్యులు

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ ఏడో వారం ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ ఒక మంచి టాస్క్ ఇచ్చారు. తమ చిన్న ‘నాటి’ జ్ఞాపకాలు గుర్తుచేసుకుని తోటి సభ్యులతో పంచుకోవాలని చెప్పాడు. దాంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఒకరి తర్వాత మరొకరు తమ చిన్న నాటి విషయాలు గుర్తు చేసుకున్నారు.

అలా వారు తమ విషయాలను గుర్తు చేసుకుంటున్న రవితేజ చిత్రంలోని ‘గుర్తుకొస్తున్నాయి’..అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అది ప్రస్తుతం బాగా వైరలవుతోంది. టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు.

నటరాజ్ మాస్టర్, శివ, అఖిల్ ఇలా తదితరులు అందరూ తమ విషయాలు చెప్తూ ఎమోషనల్ అయ్యారు. నటరాజ్ మాస్టర్..ప్రభు మాస్టర్ తో ఉన్న అనుబంధం గురించి, ఆయన ఇచ్చిన లైఫ్ గురించి వివరించారు. బిందు మాధవి మాట్లాడుతూ తాను తన అన్నయ్య ను చాలా మిస్ అవుతున్నానని పేర్కొంది. అలా ఇంటి సభ్యులందరూ తమ చిన్న ‘నాటి’ జ్ఞాపకాలు పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version