ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక షెడ్యూల్ ని విడుదల చేయగా ఏపీ సర్కార్ హైకోర్ట్ కి వెళ్ళింది. దీన్ని సింగిల్ జడ్జి ధర్మాసనం విచారించి… ఎన్నికల షెడ్యూల్ ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నికల ప్రక్రియ అనేది కరోనా వ్యాక్సినేషన్ కు అడ్డు రావొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ కి వెళ్ళగా దానిపై విచారణ జరిపిన హైకోర్ట్ రెండు రోజుల క్రితం తీర్పు రిజర్వు చేసింది. దీనిపై హైకోర్ట్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అంటూ అందరూ కూడా ఆసక్తికరంగా చూసారు. ఈ నెల 11 న సింగిల్ జడ్జి ఆదేశాలు ఇవ్వగా…
నేడు ఆ ఆదేశాలను రద్దు చేస్తూ… ఎన్నికల నిర్వహణ జరగాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఎస్ ఈసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి నోటిఫికేషన్ లు అమలులోకి వస్తాయి. నాలుగు విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 8 న నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసారు. 3 రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.