కరోనా బారిన పడి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ తుది శ్వాస విడిచారు. ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో క్రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 28 ఏళ్ళకే ఆయన మంత్రిగా పని చేసారు. 1994 లో చంద్రబాబు కేబినేట్ లో విద్యాశాఖా మంత్రిగా ఆయన సేవలు అందించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఒకసారి మంత్రిగా ఆయన పని చేసారు.
2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయి మంత్రిగా విజయం సాధించారు. నెల్లూరు జిల్లా గూడురు నుంచి నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 1985 లో ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సమర్ధనేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రి పదవికి మంచి గుర్తింపు వచ్చింది.