Bindu Madhavi: ‘బిగ్’ బాస్ బిందు మాధవి..ఆ సినిమాలో లీడ్ రోల్..మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీలో కంటెస్టెంట్ బిందు మాధవి టాప్ పొజిషన్ లో ఉంది. ఓటింగ్ పర్సంటేజీ పరంగా బిందుయే టాప్ ప్లేస్ లో ఉంది. బిందు ఆటను మెచ్చిన బీబీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెనే ‘బిగ్ బాస్ ఓటీటీ’ టైటిల్ విన్నర్ అని గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు.

బిందు మాధవి సైతం ఆటను తనదైన శైలిలో ఆడుతూ..టాస్కులు కంప్లీట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్స్ తో మంచిగా ఉంటూనే ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సినిమా మేకర్స్ బిందు మాధవికి బిగ్ న్యూస్ చెప్పేశారు. ‘నాగ’ అనే ఆధునిక పౌరాణిక సినిమాలో లీడ్ రోల్ బిందు మాధవి చేయబోతున్నట్లు చెప్పేశారు. మూవీ యూనిట్ సభ్యులు శనివారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు.

బిందు మాధవి ‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటకు రాగానే ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది. ‘నంజపురం, అజగు కుట్టి చెల్లాం, సాలై’ వంటి తమిళ్ చిత్రాలను డైరెక్ట్ చేసిన చార్లెస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బిందు మాధవి హౌజ్ లో ఉండగానే ఈ అనౌన్స్ మెంట్ రావడం పట్ల బీబీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిందు మాధవి గతంలో పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ టైటిల్ కూడా బిందు మాధవినే వరిస్తుందని ఈ సందర్భంగా నెటిజన్లు, బీబీ లవర్స్ అంటున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version