నా కొడుకు కోహ్లీకి బిగ్ ఫ్యాన్: ఇంగ్లీష్ క్రికెట్ లెజెండ్

-

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్… టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువకులపై చూపే ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. నా చిన్న కొడుకు ఇప్పుడే క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్తూ విరాట్ బ్యాటింగ్ కి వచ్చిన సమయంలో నన్ను నిద్ర లేపండి అని అతను నాకు చెప్పాడు అని వెల్లడించాడు. కోహ్లీ అవుట్ అయి బయటకు వెళ్ళగానే తన పని తాను చేసుకుంటాడు అని వెల్లడించాడు.

కోహ్లీ చిన్న పిల్లల్లో చాలా మంచి ప్రభావం చూపిస్తాడు అని అతను పేర్కొన్నారు. అతని ఆట తీరు పిల్లలకు బాగా నచ్చుతుంది అన్నాడు. భారీ షాట్ లు ఆడకుండా బంతిని గాల్లో లేపకుండా చాలా నీట్ గా ఆడతాడు అని పేర్కొన్నారు. అతను భారీ షాట్ ఆడినట్టు కనపడదు కాని బాల్ మాత్రం గాల్లోకి ఎగురుతుంది అని వెల్లడించారు. అతను ఒక ప్రత్యేక ఆటగాడు, అతను ఒక సంపూర్ణ మేధావి ”అని వాఘన్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version