రాష్ట్రంలో ఉగాది పండుగ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే, మంత్రి కొండా సురేఖ పనితీరుపై రాష్ట్ర అధినాయకత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
అందుకే ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని.. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారని టాక్ వినిపిస్తోంది. మే 7 నుండి తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల తర్వాత తెలంగాణలో మంత్రులను మార్చనున్నట్లు సమాచారం.ఇప్పటికే కేబినెట్ లోకి తీసుకునే మంత్రుల జాబితాను ఫైనల్ చేసి రాష్ట్ర అధినాయకత్వానికి హస్తిన పెద్దలు అందించనట్లు తెలుస్తోంది.