సహజంగా మహిళల ఆరోగ్యం ఎంతో బలహీనంగా ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ శాతం మహిళలు ఎముకలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ఎప్పుడైతే వయసు పెరుగుతుందో ఎముక ద్రవ్యరాశి త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా ఆర్థరైటిస్ వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కనుక తగిన జాగ్రత్తలను తీసుకొని ఎముకల ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. కనుక ముందుగానే మీ రోజువారి ఆహారంలో ఇటువంటి ఆహార పదార్థాలను తప్పకుండా చేర్చుకోండి. సహజంగా వంటలలో నువ్వులను ఎక్కువగా ఉపయోగించరు.
అయితే తెల్ల నువ్వులు మరియు నల్ల నువ్వుల లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వలన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు సరైన సమయం దొరకకపోయినా ఎలాంటి ఆహార పదార్థాలను తయారుచేసినా పైన నువ్వులను చల్లుకుని తినడం వలన ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా నువ్వులతో లడ్డులు వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. ఆకుకూరలు ఎంతో ఆరోగ్యకరమని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెంతికూర, పాలకూర తీసుకోవడం వలన మహిళల ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె ఎంతో ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ఏముక్కల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కనుక తప్పకుండా ప్రతిరోజు ఆకుకూరలను తింటే మేలు. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి పాల ఉత్పత్తులు ఎంతో అవసరం. ముఖ్యంగా పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ వంటి వాటిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాల ఉత్పత్తులలో ఉండేటువంటి విటమిన్ డి శరీరంలో క్యాల్షియంను గ్రహించడానికి సహాయం చేస్తుంది. కనుక తప్పకుండా పాల ఉత్పత్తులను మీ డైట్ లో చేర్చుకోవాలి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలలో సోయాబీన్స్ కూడా ఒకటి. వీటిని ఉపయోగించి ఎన్నో ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. అయితే సోయాబీన్స్ మాత్రమే కాకుండా సోయాతో తయారు చేసిన టోఫు, మీల్ మేకర్ వంటివి కూడా ఎంతో ప్రోటీన్ మరియు కాల్షియం ను పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.