తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఆర్టీసీ సమ్మెకు దిగనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా పడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కోడ్ ముగిసే వరకు రేవంత్ సర్కారుకు కార్మికులు గడువు ఇచ్చినట్లు సమాచారం.
కోడ్ ముగియగానే మరో నోటీసు ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే గత నెలలో ఆర్టీసీ సంఘాలు ఓ సమ్మె నోటీసు ఇచ్చాయి. తొలుత ఐదారు రోజులు సమ్మె అనంతరం నిరవధిక సమ్మెకు కార్మికులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, కార్మికుల సమస్యలు, ప్రభుత్వంలో విలీనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ వంటి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె సైరన్ మోగించారు.