ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళకు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై పలు కథనాలు రావడంతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు.
ఆధార్ కార్డు లేకుంటే వైద్యం చేయరా? ఈ నిబంధనలు ఎక్కడివి? వెంటనే ఆ మహిళకు మెరుగైన వైద్యం అందించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాకేష్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రమీలను ఆసుపత్రిలో చేర్చుకొని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న ప్రమీలను నాంపల్లి క్రిమినల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జావీద్ పాషా ఆదివారం పరామర్శించారు. ఆధార్ కార్డు లేదని అచేతన స్థితిలో ఉన్న మహిళకు వైద్యం నిరాకరించడంతో తన కూతురి ఒడిలో రోడ్డుపై బాధితురాలు పడుకుని ఉన్న దృశ్యాలు అందరినీ కదిలించాయి.
తెలుగు స్క్రైబ్ ఎఫెక్ట్
ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళకు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది వైద్యం నిరాకరించిన ఘటన గురించి తెలుగు స్క్రైబ్‌లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఆధార్ కార్డు లేకుంటే వైద్యం చేయరా? ఈ నిబంధనలు ఎక్కడివి? వెంటనే ఆ మహిళకు… https://t.co/Do4fNWWI6v pic.twitter.com/jCxxs5NQkz
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2025