రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి వరుస పెట్టి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏపీలో ఎవరూ ఊహించని విధంగా ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తన కుటుంబంతో సహా వైసీపీలో చేరిపోతోన్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు అయిన గోకరాజు గంగరాజు ఇప్పుడు ఎందుకు వైసీపీలోకి వెళుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
ఏపీలో బీజేపీకి షాక్ ఇలా ఉంటే తెలంగాణలో కనీసం వచ్చే ఎన్నికల నాటికి ఆయనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నా బిజెపికి నాయకులు తప్ప కేడర్ లేని దుస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బిజెపి… ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని రాజకీయ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఇక తెలంగాణ బీజేపీలో నేతలు ఎక్కువవడం.. కేడర్ తక్కువ అవ్వడంతో బిజెపిలో నాయకుల మధ్య ఆధిపత్యపోరు ఎక్కువ అయ్యింది.
తెలంగాణలో ఆ పార్టీకి నాయకులే తప్పా కేడర్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో నాయకులు కూడా డీలా పడుతున్నారు. ఆ పార్టీలో ఎంత మంది నాయకులు ఉన్నా వారికి అక్కడ పదవులు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం ఆ పార్టీలో పాత వర్సెస్ కొత్త నేతల మధ్య తీవ్రమైన గ్యాప్ కనిపిస్తోంది. ఇక ఎన్నికలకు ముందు బీజేపీలోకి జంప్ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లోకి రీ జంప్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జంప్ చేసిన వారే.
డీకే అరుణ ఎన్నికలకు ముందు బీజేపీలోకి జంప్ చేసి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు. పార్టీలో ఉన్నా పదవులు రావని… తెలంగాణలో కేసీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్సే పోటీ ఇస్తుంది కాని.. బీజేపీకి అంత సీన్ లేదని డిసైడ్ అయిన ఈ ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి రీ జంప్ చేస్తున్నట్టు భోగట్టా. ఇక డీకే అరుణ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత కెసి. వేణుగోపాల్‌తో బెంగళూరులో చర్చలు జరిపినట్టు టాక్. ఆమెకు టీ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సుముఖంగా ఉందట.
గతంలో డీకే అరుణ కూడా తన బలమైన వాయిస్‌తో కేసీఆర్, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేవారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అరుణను ప్రత్యేకంగా టార్గెట్ చేయడంతో ఆమె మేనళ్లుడు విష్ణువర్థన్‌రెడ్డి చేతిలో ఓడిపోయింది. ఇక ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఆమె ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లోకి రీ జంప్ చేస్తుండడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు.. అందులోనూ కాంగ్రెస్ , బీజేపీ రాజకీయం మరింతగా హీటెక్కనున్నాయి.