జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి నుంచి తమ ఉద్యోగాల కాపాడాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ను పారిశుద్య కార్మికులు కలిశారు. కరోనా మహమ్మారి వచ్చి చికిత్స కోసం సెలవు పెట్టి… ఊరికి వెళితే తనని, తన కూతురుని ఉద్యోగం నుంచి తొలగించారని పారిశుద్ద్య కార్మికురాలి ఆవేదన వ్యక్తం చేసింది.
మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి మొరపెట్టుకున్నా దుర్బషాలాడిందని ఆరోపణలు చేశారు ఆ కార్మికురాలు. కాళ్ళు పట్టుకున్నా అధికారులు స్పందిచలేదని తెలిపారు కార్మికురాలు. తమ స్థానంలో కేశవరావు కారు డ్రైవర్ తల్లిని, మేయర్ డ్రైవర్ భార్యను నియమించారని అవేదన ఆ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. బాధితుల తరఫున జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కు మెమొరాండం సమర్పించారు సిపిఐ పార్టీ నేతలు. కార్మికులు భారతి, రమాదేవి, సూపర్ వైజర్ సాయిబాబా ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ నేతలు.