ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోగా నటించిన పుష్ప సినిమా ఇవాళ విడుదలైంది. మార్నింగ్ నుంచి.. పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ పై వివాదం చెలరేగుతోంది.
ఈ సినిమా ఇవాళ విడుదల అయిన నేపథ్యం లో భార్య బాధితుల సంఘం ఆందోళన కు పిలుపు ఇచ్చింది. పుష్ప సినిమా లో హు అంటావా మామా పాట తొలగించాలని రేపు ఆందోళనకు పిలుపు ఇచ్చారు.. మగ జాతీ మొత్తం వంకర బుద్ధి అని రాయడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భార్య బాధితుల సంఘం నేతలు. రేపు సినిమా ప్రదర్శన ను అడ్డు కుంటామని కూడా పిలుపు ఇచ్చారు. పాట తొలగించే వరకు పోరాడు తామని తేల్చి చెబుతున్నారు నేతలు. అయితే దీని పై పుష్ప టీం ఇంకా స్పందించలేదు.