వైఎస్ఆర్సీపీ కీలక నేత,గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. గతంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో ఇప్పటికే మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ,ఎస్టీ కోర్టు తీర్పు చెప్పింది.
మంగళవారంతో ఆయన కస్టడీ ముగియగా ఆయన్ను జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు.అయితే, కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ మరో 3 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తున్నట్లు తీర్పునిచ్చారు. దీంతో పడమట పోలీసులు వంశీని తీసుకెళ్లేందుకు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు.నేటి నుంచి మూడు రోజుల పాటు వంశీని ప్రశ్నించనున్నారు.