మంచు విష్ణు ఆఫీస్‌లో చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..నిందితుడి సెల్ఫీ వీడియో విడుదల

-

మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వయంగా ఆరోపనలు ఎదురుకొంటున్న హెయిర్ డ్రెస్సార్ నాగ శ్రీను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి తనను చిత్ర హింసలు పెట్టీ.. కులం పేరుతో అవమానించిన కారణంగా తాను ఉద్యోగం మానేసానని హెయిర్ డ్రెస్సార్ నాగ శ్రీను తెలిపాడు.

ఉద్యోగం మానేసినందుకు రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని అక్రమంగా తనపై కేసు పెట్టారని హేర్ డ్రెస్సర్స్ నాగ శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెల 17 న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగిందని.. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యిందని సెల్ఫీ వీడియోలో తెలిపాడు హెయిర్ డ్రెస్సార్ నాగ శ్రీను. తన తల్లికి గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో జాయిన్ చేయించానని… 10 ఏళ్లుగా మోహన్ బాబు దగ్గర నమ్మకంగా పని చేస్తున్నానని చెప్పాడు.

తనపై కావాలనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని మండపడ్డాడు హెయిర్ డ్రెస్సార్ నాగ శ్రీను. తన లాంటి పేదవాడి జీవితంతో అడుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ వార్త విన్న మా తల్లి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని.. పెద్దవాళ్ళకు ఇది తగదని ఆవేదన వ్యక్తం చేశాడు. విష్ణు బాబు తన పైన ఫిర్యాదు చేసి కేసు పెట్టారని.. పేర్కొన్నాడు. ప్రస్తుతం.. హెయిర్ డ్రెస్సార్ నాగ శ్రీను విడుదల చేసిన ఈ సెల్ఫీ వీడియో హల్చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version