బిగ్‌బాస్4:జోరు పెంచిన అభి‌..కెప్టెన్సీ పోటీలో ముగ్గురు!

-

బిగ్‌బాస్ 4: జోరు పెంచిన అభిజిత్‌.. కెప్టెన్సీ పోటీలో ముగ్గురు!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 హీటెక్కుతోంది. గ‌త వారం నామినేష‌న్ ప్ర‌క్రియ కార‌ణంగా అఖిల్‌, అభిజిత్‌ల మ‌ధ్య వాడీ వేడీగా వాగ్వివాదం జ‌రిగింది. బ‌చ్చాగానికి అంటూ అఖిల్‌పై అభి ఫైర్ కావ‌డంతో రానున్నరోజుల్లో వీరిద్ద‌రి మ‌ధ్య వార్ మ‌రింత వాడీ వేడీగా సాగ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో మంగ‌ళ‌వారం ఎలా వుంటుందో అని అంతా భావించారు. 11వ వారంలోకి షో ఎంట‌రైన నేప‌థ్యంలో ఎవ‌రి ఆట వారు ఆడ‌టం మొద‌లుపెట్టారు. మంగ‌ళ‌వారం బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌ని క‌మాండో ఇనిస్టిట్యూట్‌గా మార్చేశాడు.

ఇంటి స‌భ్యులంతా బుల్లెట్ల‌ని త‌ప్పించుకుంటూ బిగ్‌బాస్ చెప్పిన టాస్క్‌ల‌ని పూర్తి చేయాల్సి వుంటుంది. గార్డెన్ ఏరియాలో వున్న బ‌జ‌ర్‌ని ముందు ఎవ‌రైతే ట‌చ్ చేస్తారో వారికి బిగ్‌బాస్ టాస్క్ ఇస్తారు. ఇలా ఐదు బ‌జ‌ర్‌లు మాత్ర‌మే మోగించాల్సి వుంటుంది. ఇందులో మంగ‌ళవారం న‌లుగురు బ‌జ‌ర్‌ని మోగించి టాస్క్‌లో పాల్గొన్నారు. తొలి సారి సోహైల్ బ‌జ‌ర్‌ని మోగించి స్విమ్మింగ్ పూల్‌లో బ‌రువైన వ‌స్తువుల్ని పూల్ మొద‌లు నుంచి చివ‌రికి ఒక్కో వ‌స్తువుని చేర‌వేయాలి. ఇదంతా 5 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ టాస్క్‌లో చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించి సోహైల్ విఫ‌ల‌మ‌య్యాడు. ఆ త‌రువాత బ‌జ‌ర్‌ని అఖిల్ మోగించి పోల్‌ని కౌగిలించుకుని వుండే టాస్క్‌ని ఎంచుకున్నాడు.

ఇందులో అఖిల్ స‌క్సెస్ సాధించి స్టార్‌ని ద‌క్కించుకున్నాడు. ఆ త‌రువాత అభిజిత్ బ‌జ‌ర్‌ని మోగించి మంకీ టాస్క్‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. దీంతో అభికి హారిక స్టార్‌ని అందించింది. ఆ త‌రువాత బ‌జ‌ర్‌ని హారిక ట‌చ్ చేసి టైర్‌ని 15 రౌండ్లు దొర్లించే టాస్క్‌ని ఎంచుకుంది. ఈ టాస్క్‌లో హారిక కూడా విజ‌యం సాధించి స్టార్‌ని ద‌క్కించుకోవ‌డంతో కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్‌, అభిలతో పోటీకి నిలిచింది. స్టార్టింగ్ నుంచి ఫిజిక‌ల్ టాస్క్‌ల‌లో అభి ఎఫ‌ర్ట్ పెట్ట‌డం లేద‌ని వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ఈ ప్ర‌క్రియలో ఫుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఈ టాస్క్‌కి ముందు అభికి, అవినాష్‌కి మ‌ధ్య చిన్న వాగ్వివాదం జ‌రిగింది. ఆ త‌రువాత అరియానాకు, అవినాష్‌కు మ‌ధ్య ర‌చ్చ జ‌ర‌గ‌డం కొస‌మెరుపు. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్‌, అభి, హారిక‌ల‌లో ఎవ‌రు స‌క్సెస్ అవుతార‌న్న‌ది బుధ‌వారం తేల‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version