బిగ్ బాస్ 6: పక్కా ప్లానింగ్ తోనే గీతూని పంపేశారా..?

-

బిగ్ బాస్ ముద్దుబిడ్డ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాప్ ఫైవ్ లో నిలుస్తుందని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఈమె కచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతుందని మరి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది గీతూ రాయల్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పక్కా ప్లానింగ్ తోనే ఈమెను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్వతహాగా మంచి మనసున్న అమ్మాయి అంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న గీతూ.. హౌస్ లో తాను చేసిన ప్రవర్తన వల్లే నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంది.

ఇటీవల గీతు గేమ్ చూసుకుంటే హోస్ట్ నాగార్జున కూడా ఆమెను నిల్చోబెట్టి మరీ కడిగేసాడు. ఫిజికల్ గేమ్ లో ఇరగదీస్తున్నానంటూ బోల్తా పడింది. అంతేకాదు బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకంగా తన సొంత రూల్స్ పెట్టింది. అవన్నీ హౌస్ లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఏం మాట్లాడిన రూల్ ఉందా? అనే గీతూ ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తూ గేమ్ ఆడటం ఎవరికీ నచ్చలేదు . నాగార్జున కూడా బొచ్చులో ఆటలే అంటూ ఆమెను ఇన్సల్ట్ చేశాడు.. అంతేకాదు బాలాదిత్య వీక్ నెస్ తో ఆడుకోవడాన్ని అంతా తప్పుపట్టారు . రెండు స్ట్రిప్ లు ఇస్తే సిగరెట్ ఇస్తానంటూ, లెటర్ ఇస్తానంటూ బాలాదిత్య ఏడుపుకు గీతూ కారణం అయింది.

అంతేకాదు ఆదిరెడ్డి కూడా గీతూ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా సరే వారికి ధీటుగా మాట్లాడుతూ ఆమెతో ఫ్రెండ్షిప్ చేశాడు. అలాంటి ఆదిరెడ్డిని కూడా ఆమె వెన్నుపోటు పొడిచేందుకు పథకం పన్నింది. అతని టీ షర్టు దాచేసి గెలవాలని చూసింది. ఆ విషయంలో ఆదిరెడ్డి చాలా హర్ట్ అయ్యాడు. ఏదో ఒక రోజు కన్నీళ్లు తెప్పిస్తా.. ఆ రోజు నా దెబ్బ ఏంటో నీకు తెలుస్తుంది అంటూ చాలెంజ్ చేశాడు. ఈ క్రమంలోనే గీతూను హౌస్ లో ఉంచకూడదని భావించిన బిగ్బాస్ ప్రేక్షకులలో ఆమెకు వస్తున్న నెగిటివిటీ నీ దృష్టిలో పెట్టుకొని ఎట్టకేలకు గీతూ ను ఎలిమినేట్ చేశారు. దీంతో ఆమె అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version