బిగ్ బాస్: సీక్రెట్ రూం పేరుతో అఖిల్, అభిజిత్ మధ్య చిచ్చు..

-

బిగ్ బాస్ లో ఈ రోజు ఎపిసోడ్ లో అఖిల్ సీక్రెట్ రూంలోకి వెళ్ళిపోయాడు. హౌస్ లో ఉన్న వాళ్ళందరిలో నుండి ఎవరో ఒకరిని ఇంటి నుండి బయటకి పంపించాలని కోరగా అందరూ అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక పంపివేస్తున్నాం అని నిర్ణయించుకున్నారు. అటు అఖిల్ కూడా, ప్రేక్షకులు నాకు తక్కువ ఓట్లు వేసారన్న కారణంగా కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వెళ్ళిపోవడం బాగుంటుందని వెళ్ళిపోయాడు.

ఐతే కంటెస్టెంట్స్ అనుకున్నట్టు అఖిల్ బయటకి రాలేదు. సీక్రెట్ రూంలో ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారిపోయాయి. అఖిల్, అభిజిత్ ల మధ్య స్నేహం చెడగొట్టేందుకే బిగ్ బాస్ ఇలా చేసుంటాడని అనుకుంటున్నారు. అఖిల్ అలా ఎందుకు వెళ్ళిపోయాడు, డిఫెండ్ చేసుకోవాల్సింది. అలా ఎలా వెళ్ళిపోతాడు అనే మాటలు అంటుంటే, ఈ మనిషి ఏమీ చేయడు. ప్రతీ దాన్నికి అడ్డు తగిలి గేమ్ ని ముందెకెళ్ళనివ్వడు. కూర్చుని ఏవో లెక్కలు వేస్తూనే ఉంటాడు అని అఖిల్ అన్నాడు.

అదీగాక నువ్వు గేమ్ ఆడడానికి రాలేవు అంటూ కామెంట్లు చేసాడు. ఇదంతా చూస్తుంటే నామినేషన్లలో క్లోజ్ గా కనిపించిన వారి మధ్య చిచ్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. అతను నాకు ఫ్రెండ్ అయ్యాడు.. ఆమె నాకు ఫ్రెండ్ అయ్యింది.. ఎవరిని నామినేట్ చేయాలి, అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో గేమ్ ని మరింత రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ వేసిన ఎత్తుగడే అఖిల్ ని సీక్రెట్ రూంలోకి పంపడం అని అర్థం అవుతుంది.

మొత్తానికి అఖిల్, అభిజిత్ ల మధ్య మళ్ళీ రచ్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version