బిగ్ బాస్: స్క్రిప్టెడ్ కాదన్న అవినాష్.. అదెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్న జనాలు..

-

బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుండి అందరికీ అనుమానం కలిగిస్తున్న ఒకే ఒక్క అంశం. షో స్క్రిప్టు ప్రకారం కొనసాగుతుందని. మోనాల్ ని సేవ్ చేసుకుంటూ చివరి దాకా తీసుకురావడం గానీ, దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేట్ అవడం, కంటెస్టెంట్ల మధ్య అనవసర ప్రేమలు.. మొదలగునవన్నీ బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారంగా కొనసాగుతుందనే అనుమానాలని కలిగించాయి. అదీగాక వారాంతాల్లో నాగార్జున గారు వచ్చే ఎపిసోడ్ సైతం పూర్తి స్క్రిప్టెడ్ గా కనిపించడమే అందుకు కారణం.

 

ఈ విషయమై చాలా మంది కంటెస్టెంట్లు ఈ షో స్క్రిప్టెడ్ కాదని, హౌస్ లో కనిపించే ఎమోషన్స్ అన్నీ రియల్ అనీ చెబుతుంటారు. నాగార్జున కూడా అప్పుడప్పుడు ఈ విషయమై బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని చెబుతూ ఉంటారు. ఐతే గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ ఎపిసోడ్లు చూస్తుంటే, షో పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారంగానే వెళ్తుందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం మేకర్స్ ని చేరిందో లేదో తెలియదు గానీ తాజాగా హౌస్ లో అవినాష్ మాట్లాడుతూ, ఈ షో స్క్రిప్టెడ్ కాదు అని బల్లగుద్ది చెప్పాడు.

టాస్కు విషయంలో ఆరియానా బాధపడుతుంటే, ఆమెని ఓదారుస్తూ, చాలా మంది ఈ షో స్క్రిప్టెడ్ అనుకుంటారు. కానీ ఇది స్క్రిప్టెడ్ కాదు. ఇవన్నీ రియల్ ఎమోషన్స్ అని చెప్పాడు. ఐతే ఇక్కడే అందరికీ అనుమానం వచ్చింది. సరిగ్గా బయట జనాల్లో షో మొత్తం స్క్రిప్ట్ పరంగా వెళ్తుందని వార్తలు వస్తున్న సమయంలో కంటెస్టెంట్ అయిన అవినాష్ నోటి నుండి స్క్రిప్టెడ్ కాదు అనే మాట రావడంతో బయట విషయాలు లోపల ఉన్న వారికి ఎలా తెలిసాయనే అనుమానం మొదలైంది.

ఇది కూడా బిగ్ బాస్ స్క్రిప్టే అని చెప్పకనే చెప్పినట్టయ్యిందని అనుకుంటున్నారు. అసలే చప్పగా సాగుతున్న బిగ్ బాస్ షో, ఇలాంటి అనుమానాలని క్రియేట్ చేసి, మరింత అయోమయంలోకి నెట్టేలా కనిపిస్తుంది. మరి యాజమాన్యం దీనిమీద దృష్టి పెడుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version