నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10, 954 ఉద్యోగాలపై ప్రభుత్వ కీలక ప్రకటన

-

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పలు కీలక మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి వీఆర్వో, వీఆర్ఏలను తొలగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వారి సేవలను వినియోగించుకుంటామని ప్రకటించింది.

ప్రభుత్వం చెప్పినట్టుగానే వీఆర్ఏ, వీఆర్వోలను గ్రామ పాలన ఆఫీసర్  పోస్టుల్లో వినియోగించుకోనుంది. రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి వీఆర్వో, వీఆర్ఏగా కనీసం ఐదేళ్లు పని చేయాలి. వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులుంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version