Bigg Boss 5: “అందుకే ఆమె హౌస్ లోకి వెళ్ళింది”.. ఆనీ మాస్ట‌ర్ బండారం బ‌య‌ట‌పెట్టిన బిస్ బాస్ మాజీ కంటెస్టెంట్!

-

Bigg Boss 5: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న షో బిస్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ.. మ‌రింత ర‌స‌వ‌త్తంగా మారుతోంది. వారానికి ఒక్కో కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు. ఇక ఉన్న వాళ్లలో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠ బిగ్ బాస్ లో మొద‌లైంది. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం బయట ఫ్యాన్ తెగ ప్రమోషన్స్ చేస్తున్నారు .
సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిమాన కాంటెస్టెంట్ల‌కు ఓట్లు వేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ ప్రమోషన్స్ కూడా పీక్స్ కు చేరింది. మరో పక్క కంటెస్టెంట్స్ కి సపోర్ట్ గా వేరే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గ‌జ్జ‌ర్.. ఆనీ మాస్ట‌ర్ కి మద్దతుగా నిలిచింది. ఆమెకు ఓటు వేసి సప్పోర్ట్ చేయాలంటూ ప్ర‌చారం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఆనీ మాస్టర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్
అని, ఆనీ మాస్ట‌ర్ త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా చాలా భాగా తెలుసు. ఆమె చాలా స్ట్రాంగ్‌, ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా త‌న కెరీర్ లో స్వ‌యంకృషితో పైకి వ‌చ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాల‌న్న ఆశ‌తో బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లిందనీ, ఆ క‌ల‌ నెర‌వాల‌ని కోరుకుందామ‌నీ,ద‌య‌చేసి ఆమెకు ఓట్లు వేసి.. గెలిపించండ‌ని తన అభిమానుల‌ను రిక్వెస్ట్ చేసింది మోనాల్‌. హౌస్లో భాష పూర్తిగా రాకున్నా.. ఫైటింగ్ స్పిరిట్ కనబరుస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారని ప్ర‌చారం చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఆర్జే కాజల్ విష‌యంలో ఆనీ మాస్ట‌ర్ నెగిటివీటి ముఠా క‌ట్టుకుంది. ఆనీకి కాజ‌ల్ కి అస్సలు పడదు.. ఆమె ప‌ట్ల ఆనీ మాస్ట‌ర్ ప్రవర్తన తీరు బాగాలేదని. కాజ‌ల్ చేసే ప్ర‌తి ప‌ని లోనూ మండిపడుతార‌నే టాక్ ఉంది. అదీ నామినేషన్స్ కావచ్చు, అటు టాస్క్స్ కావచ్చు. వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే.. భంగుమ‌నేలా ఉంటుంది. వీరిద్దరూ ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఆమె హౌస్లో ఒక వర్గానికి దగ్గరగా ఉండడం అనేది టాక్ అందరిలో ఉంది. ఇవి అన్ని ఆనీ మాస్ట‌ర్ కు మైన‌ప్ పాయింట్లే అయిన చెప్పాలి. ఈ వారం ఆనీ మాస్ట‌ర్ డేంజ‌ర్ జోన్లో ఉంది అని మాస్ట‌రే అనే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version