అతను ఓ చర్చిలో పియానో వాయిస్తూ అమ్మాయిలకు వలవిసురుతాడు. అమ్మాయిలే కాదు.. పెళ్లయిన మహిళలను సైతం తన పియానోతో వసపరుచుకున్నాడు..అలా ఈయనగారి వలలో ఏకంగా 19 మంది చిక్కారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. వీడి మాయలో పడి ఆ 19 మంది మహిళలు ఘోరంగా మోసపోయారు. అసలు ఇలా ఇంతమందిని ఎలా ట్రాప్ చేశాడు అనే డౌట్ వస్తుంది కదా..చూద్దాం ఏం ఏం చెప్పాడో ఈ ప్రభుద్ధుడు.
నల్గొండలోని ఓ చర్చిలో పియానో వాయించే విలియమ్స్అనే వ్యక్తి మహిళలను మోసం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చర్చికి వచ్చే యువతులను, పెళ్లైన వారిని సైతం విలయమ్స్ శారీరకంగా లోబరుచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదాంతం అంతా ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో బయటపడింది. అంతే పోలీసులు విలయమ్స్ ను అరెస్టు చేయటానికి ప్రయత్నించారు. మనోడు మాములోడు కాదుగా..గుండెపోటు వచ్చిందంటూ… ఆసుపత్రిలో చేరాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంత జరిగినా విలియమ్స్ భార్య ఏం చెబుతుందంటే.. డబ్బు కోసమే తన భర్తపై కేసు పెట్టిందని విలియమ్స్ భార్యా శ్రీలత (20) ఆరోపిస్తుంది. గత కొంతకాలంగా బాధిత మహిళ కుటుంబానికి మా ఆయన ఎంతో సాయం చేశాడని పేర్కొంది. కేవలం ఆర్థికంగా సహాయం చేశాడే తప్ప.. ఆమెను మోసం చేయలేదంటూ చెప్పుకొచ్చింది.
అదంతా అవాస్తవమని చెబుతుంది. గత నెల 25న మేము ప్రేమ వివాహం చేసుకున్నామని నేనే విలియమ్స్ మొదటి భార్యను అని శ్రీలత తెలిపింది. ఆమె డబ్బు కోసమే తన భర్తపై ఆరోపణలు చేస్తుందని వెల్లడించింది. ఒకసారి రూ. 70 లక్షలు, మరోసారి రూ. 20 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేసిందని విలియమ్స్ భార్య తెలిపింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆరోగ్య పరీక్షల్లో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారణ కాకపోవడంతో పోలీసులు విలియమ్స్ ను అరెస్ట్ చేశారు.
– Triveni Buskarowthu