పొదల్లోకి తోసి లైంగిక దాడి చేయబోయాడు : హీరోయిన్

-

కేబీఆర్ పార్క్ లో సినీనటి షాలూ చౌరాసియా పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల ప్రాంతంలో కెబిఆర్ పార్క్ లో స్టార్ బక్స్ ఎదురుగా నటిపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. అప్పటికే కాపు కాచి ఉన్న దుండగుడు నటి రన్నింగ్ చేస్తున్న సమయంలో వెనక నుండి దాడికి పాల్పడ్డాడు. కాగా తాజాగా ఈ ఘటనపై షాలు చౌరాసియా స్పందించింది. ఆమె మాట్లాడుతూ…ఈ నెల 14వ తేదీన సాయంత్రం కేబీఆర్ పార్క్ కు వాకింగ్ కు వెళ్లాను.

Shalu chourasiya opened about attak on her

పార్క్ నుండి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి నాపై దాడి చేశాడు. డబ్బులు ఇవ్వాలని…10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో డబ్బులు లేవు గూగుల్ పే నంబర్ చెప్పాలని అడిగాను. అతడు నంబర్ చెబుతున్న సమయంలో డయల్ 100 కు ఫోన్ చేశాను. అది గమనించిన దుండగుడు నా తలను బండరాయి పై బలంగా కొట్టాడు. దాంతో స్పృహ తప్పి పడిపోయాను. ఆ తరవాత పొదల్లోకి లాగి లైంగిక దాడికి యత్నించాడు” అంటూ నటి తనపై జరిగిన దాడి గురించి వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version