Bigg Boss 5 Telugu: “ఊసరవెల్లి పాపాలు పండాయి” విశ్వ ఎలిమినేష‌న్ పై నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎవరూ ఊహించ‌ని టాస్కులు, గేమ్స్ తో బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ర్షిస్తుంది. గొడవలతో కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. ఇక రోజురోజుకు ఎక్క‌డ క‌నిపించ‌ని సిత్రాలు బాగానే జరిగాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటి వ‌ర‌కూ విజ‌య‌వంతంగా ప‌ది వారాలు పూర్తి చేసుకుంది. ఇక తొమ్మిదో వారం ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఎవరూ ఊహించని హౌస్‌మేట్ ఎలిమినేట్ అయ్యారు టాస్కుల కింగ్ విశ్వ‌.

విశ్వ టాస్క్‌ల విషయంలో, అందరితో కలిసిమెలిసి ఉండే విశ్వ‌. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎలిమినేట్ కావ‌డం షాక్ కు గురి చేసింది అటూ హౌస్ స‌భ్యుల‌కు, ఇటు బిగ్ బాస్ ప్రేక్షకుల‌కు. మిగిత కంటెస్టెంట్ల‌తో పోల్చితే.. విశ్వ చాలా స్ట్రాంగ్ అని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. ఈ క్ర‌మంలో విశ్వను కూడా అనవసరంగా పంపించేశారంటూ తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అంద‌రికంటే. స్ట్రాంగ్ అయిన విశ్వని హౌస్ నుంచి పంపించ‌గా.. ఇక‌ గేమ్ ఏం ఉంటుంది.. గేమ్‌లో ఫన్ ఏముంటుంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. విశ్వ ఎలిమినేష‌న్ పై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నటరాజ్‌ మాస్టర్‌ స్పందించారు. ‘అందరికీ సూపర్ ఎగ్జైట్ మెంట్ న్యూస్.. హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నటరాజ్‌ మాస్టర్ కే కౌంట‌ర్ వేస్తున్నారు. ‘మరి నువ్వెందుకు నాలుగో వారంలోనే బయటకు వచ్చావు? అంటే తమరెన్ని పాపాలు చేశారో!’, ‘మీ పాపం నాలుగో వారంలోనే పండింది’, ‘నువ్వు విశ్వ ఆడినదాంట్లో సగం కూడా ఆడలేదు, పైగా పోజులు కొడుతున్నావ్‌’, ‘నీ సోది జంతువులకు చెప్పుకోపో.. అంటూ ఏకిపారేస్తున్నారు నెటిజ‌న్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version