Pakka Commercial : పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ‘పక్కా కమర్షియల్’ టీజర్..

-

Pakka Commercial: మ్యాచో హీరో గోపిచంద్, రాశీఖన్నా జంటగా తెర‌కెక్కిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ప్ర‌తి రోజు పండ‌గే’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను కొట్టిన విల‌క్షణ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైనా.. ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చింది. సోమవారం ‘పక్కా కమర్షియల్’ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ కు విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ టీజ‌ర్ లో గోపిచంద్ లుక్స్ చాలా స్టైలిస్ గా ఉంది. డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో గోపి చంద్ తో క‌లిసి ఈ అమ్మ‌డు.. ‘జిల్’, ‘ఆక్సిజన్’ సినిమాల్లో కలిసి నటించిన విష‌యం తెలిసిందే.. ఇప్పుడూ ముచ్చ‌ట‌గా మూడోసారి న‌టిస్తున్నారు.

ఈ ట్రైలర్‌లో గోపీచంద్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ‘ఎవరికి చూపిస్తున్నారు సర్ మీ విలనిజం.. మీరిప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసొచ్చా.. నా హీరోయజానికి ఓ ఆరా ఉంటుంది. దాని కొంచెం కాన్సన్‌ట్రేట్ చేస్తే.. ఓ ఆర్ఆర్ వినిపిస్తుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి..’ అని గోపీచంద్ డైలాగ్స్ అదిరిపోయాయి.

టీజ‌ర్ చూస్తుంటే.. హీరోయిన్ రాశీ ఖన్నా.. కామెడీ యాంగిల్ లో క‌నిపించింది. రాశీ ఖ‌న్నా ను మారుతి బాగానే వాడుతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న పక్కా కమర్షియల్ టీజ‌ర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version