Bigg Boss Telugu 5: బిగ్ బాస్ షో బండారం బ‌య‌ట‌పెట్టిన కండ‌ల వీరుడు .. షో స్క్రిప్టెడేనా?

-

Bigg Boss Telugu 5: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌లా ఆక‌ట్టుకుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ షో అటు హిందీలోనే కాకుండా ద‌క్షిణాది భాష‌లైనా.. క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగులో కూడా ఈ షో ఎంతగానో పాపుల‌రీ సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఈ షో కు తొలి సీజ‌న్ కు జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత రెండో సీజ‌న్ కు నాని హోస్ట్ చేశారు. మూడు, నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఈ సీజ‌న్ల‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావ‌డంతో ఇక ఈ ఐదవ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు.

ప్ర‌స్తుత సీజ‌న్ ఎన్నాడు లేని విధంగా 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభం కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిది మంది ఎలిమినేట్ అవ్వగా.. ప‌దో వారం అనారోగ్య స‌మ‌స్య‌తో జ‌శ్వంత్ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్ది రోజురోజూకు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది.

పదవవారం నామినేషన్స్‌లో సన్నీ, మానస్‌, కాజల్‌, సిరి, రవిలు ఉండ‌గా.. అందులో కాజ‌ల్ ఎలిమినేట్ కానుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఓటింగ్ లో కూడా.. కాజ‌ల్ ఎలిమినేట్ కానున్న‌ది తేలింది. కానీ జెస్సీ ఆరోగ్య కారణాల వలన ఇంటి నుంచి ఆయన బయటకు రావడంతో కాజల్ ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో కాద‌నీ, ఆ షో స్క్రిప్టెడ్ షో నేని.. నెట్టింట్లో తెగ చ‌ర్చ జ‌రిగింది.

ఈ త‌రుణంలో బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్ విశ్వ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. షో సీక్రెట్ ను బ‌య‌ట పెట్టేశాడు. షో లో మిస్ట‌ర్ ఫ‌ర్పెక్ట్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ విశ్వ‌. టాప్ 5 కంటెస్టెంట్లో ఉంటాడ‌ని బిగ్ బాస్ అభిమానులు భావించారు. కానీ, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స‌డెన్ గా ఎలిమినేట్ అవ్వ‌డం చాలా మంది బిగ్ బాస్ ల‌వ‌ర్స్ కి షాకింగ్ ఇచ్చింది. షో నిర్వ‌హ‌ణ స‌రిగా లేద‌నే వాద‌న‌లు వెలుబ‌డ్డాయి.
ఈ నేపథ్యంలో.. బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అన్న ఒక టాక్ నడుస్తోంది.

తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న విశ్వ.. ఈ విషయంలో అస‌లు బండారం బయ‌ట‌పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఆ షో స్క్రిప్టెడ్ షో అని కానీ, అది వాస్త‌వం కాదు.. బిగ్ బాస్ రియాలిటీ షోలో జరిగేవన్నీ నిజంగా జరిగేవే, స్క్రిప్టెడ్ కాదని కుండ బద్దలు కొట్టారు విశ్వ. ఆయ‌న మాటల‌తో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. చాలా మంది ప్రేక్షకులకు క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఈ త‌రుణంలో బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా శ్రీ రామచంద్ర అవుతాడని తన అభిప్రాయాన్ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version