ఇది ఆప్ఘనిస్తానా.. పాకిస్థానా…? – బండి సంజయ్

-

రైతులు తమ బాధలు చెప్పుకునేందుకు స్వయంగా వస్తుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానాకాలం పంటను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులతో మాట్లాడటానికి వస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఆరాచకానికి తెర తీసింది అన్నారు బండి సంజయ్. ధాన్యం కొనుగోలు చేసే దాకా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

రైతులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో, కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. డబ్బలు ఇచ్చి మరీ దాడులకు ఉసిగొలుపుతున్నారంటూ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు బండి సంజయ్.  టీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తూ.. బీజేపీ పై ఆరోపణలు చేస్తుందని దొంగే.. దొంగా అన్న చందంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు. రైతుల ముసుగులో టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా..ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. డీజీపీ ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. ఇది ఏమైనా ఆఫ్ఘనిస్తానా.. పాకిస్థానా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version