బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయింది ఎవరంటే..?

-

పాశ్చాత్య దేశాల నుంచీ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే.. అది కేవలం బిగ్ బాస్ మాత్రమే ద్వారా ప్రేక్షకులు బాగా టీవీలకే అతుక్కుపోతున్నారు అని చెప్పవచ్చు. అయితే ఇది గత ఐదు సీజన్ ల వరకు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ లో ఇప్పటికే ఐదు సీజన్లో కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయాయి. కానీ ఆరవ సీజన్ మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడమే కాదు కనీసం ముఖాలు కూడా ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవడం వల్లే ఈ షో పై ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.. బిగ్ బాస్ ఆరవ సీజన్లోకి 21 మంది బుల్లితెర సోషల్ మీడియా సెలబ్రిటీలు కంటెస్టెంట్ గా హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఐదు వారాలకు సంబంధించిన ఎలిమినేషన్స్ ప్రక్రియ నిర్వహించగా.. ఐదు మంది ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్ తీసేయడంతో రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇక అందులో రెండవ వారమే అభినయశ్రీ , షాని ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం నేహా చౌదరి ఎలిమినేట్ కాగా నాలుగవ వారం మరొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదవ వారం జబర్దస్త్ కమెడియన్ చంటి కూడా ఎలిమినేట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇతడు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాడు. అంతేకాదు హౌస్ లో కొన్ని రోజుల వరకు ఎవరితో పెద్దగా ఇంట్రాక్ట్ అవడం లేదు. ఈ క్రమంలోనే ఇతడికి ఓటింగ్ కూడా పడిపోవడంతో చంటి క్రేజ్ తగ్గిపోయింది.

ఇక ఈ క్రమంలోని ఆరవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆరవ వారం ఎలిమినేషన్ లో భాగంగా సుదీప ఎలిమినేట్ అయినట్లు సమాచారం. పెద్దగా పెర్ఫార్మన్స్ చేయకపోవడం వల్ల ఓటింగ్ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ వారం సుదీప ఎలిమినేట్ అయ్యారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version