ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..ఆస్తులపై ఈడీకి ఫిర్యాదు..!

-

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత ఆస్తులపై విచారణ జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లోని జాయింట్ డైరెక్టర్ కు జడ్సన్ లిఖిత పూర్వక కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు లో కవిత 2014 లో పోటీ చేసిన నాటి నుండి ఆమె ఆస్తులు భారీగా పెరిగిపోయాయి అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఈడి కి అప్పగించారు.

మూడేళ్లలో కవిత ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఏ ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అన్న వివరాలను సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత తండ్రి సీఎం కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని జడ్సన్ ఆరోపించారు. దీనికి సంబంధించి జూలై 10న ఈడికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అందుకే మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్టు జడ్సన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జడ్సన్ మూడు రోజుల క్రితమే కేటీఆర్ కు డ్రగ్స్ కేసు తో సంబంధాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version