ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది : సీఎం రేవంత్

-

తెలంగాణ ఏర్పాటు హామీ ఇచ్చిన సోనియా గాంధీ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండి. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు. ఇద్దరూ వేరు కాదు.. ఒక్కటే. కాబట్టి ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే.

లిక్కర్ స్కాం పార్టనర్ ను తెలంగాణా లో ఓడించాం.. అసలు పార్టనర్ ను ఢిల్లిలో ఓడిస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిని అడ్డుకుంటే చాలు, ఆ నిధులతో పేదలకు మంచి చేయవచ్చు. తెలంగాణలో అదే చేశాము. కేసీఆర్ తెలంగాణ ను దోచుకున్నారు. పెట్టబడుల కొరకు దావొస్ వెళ్తున్నాం. వచ్చాక ఎన్ని నిధులు తీసుకొచ్చమో చెప్తాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version