బిగ్బాస్ కి వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు బిగ్ బాస్ కొంతమందికి మంచి లైఫ్ని ఇచ్చింది. కొంత మంది మాత్రం రిస్క్ లో పడ్డారు. బిగ్బాస్ కి వెళ్లి తన కాపురాన్ని కూల్చుకున్న అని ఒక నటి ఆవేదనని వ్యక్తం చేస్తుంది. మలయాళ బ్యూటీ ఆర్య సీరియల్స్ లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం చూస్తోంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త తో విడిపోవడానికి గల కారణాలు చెప్పింది.
నా భర్త నన్ను వదిలించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళమని ఫోర్స్ చేశాడు అని చెప్పింది నేను వెళ్లడానికి సపోర్ట్ తానే ఇచ్చాడు చాలా రోజుల తర్వాత బిగ్బాస్ నుండి తిరిగి వచ్చాను కానీ అతని చిరునామా లేదు అతని కోసం ఎంత వెతికినా ఫలితం లేదు ఆ తర్వాత నా సోదరికి కాల్ చేస్తే అప్పుడు తెలిసింది వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని దుబాయ్ లో ఉన్నాడని నేను మాత్రం కోవిడ్ కారణంగా అక్కడికి వెళ్ళలేకపోయాను అలా నేను నా భర్తతో విడిపోయానని చెప్పింది ఆర్య.