బీహార్ రాష్ట్రంలో ఓ అసాధారణ సంఘటన జరిగింది. బీహార్ లోని ఖగారియా ప్రాంతానికి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు చాక్లెట్స్ అనుకుని శృంగార కోరికలను పెంచే మ్యాన్ ఫోర్స్ టాబ్లెట్లను తిన్నాడు. మాత్రలు తిన్న తరువాత యథావిధిగా ఆటాడుకునేందుకు వెళ్లాడు. అయితే ఆ సమయంలో బాలుడు తలతిరిగి కింద పడిపోయాడు. దీంతో అలెర్ట్ అయిన అతని తల్లిదండ్రులు బాలుడిని సమీపంలో ఉన్న ఖగారియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న అత్యవసర వార్డుకు తరలించారు.
డాక్టర్ అలీ పిల్లవాడి సింప్టమ్స్ చూసి షాక్ తిన్నాడు. అసలు ఇలాంటి సింప్టమ్స్ కలిగిన కేసులు చూడటం డాక్టర్ బర్కత్ అలీకి అదే మొదటిసారి. విషయం ఆరా తీయగా… తల్లిదండ్రులు అసలు విషయాన్ని చెప్పారు. బాలుడు చాక్లెట్ అనుకుని మ్యాన్ ఫోర్స్ టాబ్లెట్లు తిన్నాడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పిల్లవాడు ఆ మాత్రలు మింగిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్ బిగుసుకుపోవడంతో పాటు.. శరీరం నుంచి పెద్ద ఎత్తున చెమలు పట్టాయి.
ఇలాంటి కేసులు హ్యాండిల్ చేయడం డాక్టర్ బర్కల్ అలీకి అదే మొదటిసారి..దీంతో పాట్నా ఎయిమ్స్ లో ఉన్న తన ఫ్రెండ్ శిశు వైద్య నిపుణుడిని సంప్రదించారు. అతను బాలుడికి ఎలాగైనా వాంతి చేయించాలని డాక్టర్ బర్కత్ అలీకి సూచించాడు. దీంతో బాలుడు కొద్దిగా కోలుకున్నాడు. ఆతరువాత ఉప్పు నీటి ద్రావణం తాగడం ద్వారా బాలుడు పూర్తిగా వాంతులు చేసుకుని సాధారణ స్థితికి వచ్చాడు. గంట పాటు వైద్యం అందించిన తర్వాత బాలుడు కోలుకున్నాడు. ఈ ఘటన ఫిబ్రవరి 26న జరిగింది.
మ్యాన్ ఫోర్స్ వంటి టాబ్లెట్లు పెద్దవాళ్లకు మాత్రమే అని, చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోెసారి పిల్లుల ఇవి తెలియకుండా తీసుకుంటే ప్రాణాలు కోల్పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.