భార్యభర్తల సంబంధంపై చాలా సార్లు కోర్టులు సంచలన తీర్పులను వెల్లడించిన సంగతి తెలిసిందే. భార్య అనుమతి లేకుండా శృంగారం చేయడం కూడా తప్పే అని చాలా సందర్భాల్లో కోర్టులు వ్యాఖ్యానించాయి. ఇటీవల పలు కారణాల వల్ల విడాకుల కేసులు పెరుగుతున్నాయి. పెళ్లియిన కొన్ని రోజులకే పెటాకులు అవుతున్నాయి. చాలా మంది యువజంటలు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా విడాకుల కేసులో ఛత్తీస్ గఢ్ హైకోర్ట్ బార్యభర్తల శృంగారంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి శారీరక సంబంధాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమే అని ఛత్తీస్గడ్ హైకోర్ట్ అభిప్రాయపడింది.
విడాకుల విషయంలో హైకోర్ట్ లో విచారణకు వచ్చిన ఓ కేసును విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో భార్య కలిసి ఉండటం లేదని.. శృంగారానికి నిరాకరిస్తుండటంతో విడాకులు కావాలని భర్త పిటిషన్ దాఖలు చేశాడు. పిటీషన్ ను విచారించిన సదరు కోర్ట్ వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. భార్యభర్తల మధ్య శారీరక సంబంధం ఆరోగ్యకరమైన వైవాహిక జీవితంలో ముఖ్యమైన భాగాలలో ఒకటి అని కోర్ట్ ఈ సందర్భంగా పేర్కొంది.