బీహార్‌‌ ఫలితాలు..తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!

-

బీహార్‌ ఎన్నికల ఫలితాలను తేల్చేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌..బీహార్‌ తుపరి సీఎం ఎవరనేదానిపై ఒక క్లారిటీకి వచ్చాయి పోల్ సర్వేసంస్థలు..ఈ సారి మూడు దశల్లో హోరా హోరినా బీహర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..బీహార్‌లో మహాగట్భందన్‌కే ఆధిక్యత లభించే అవకాశం ఉందని తెల్పింది పీపుల్ పల్స్ సర్వే. ఆర్జేడీకి 85-95 సీట్లు, కాంగ్రెస్ కు 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని అంచనా వేస్తోంది..ఇక బీజేపీ 65-75, జేడీయూ 25-35 సీట్లకే పరిమితమవుతుందని తెల్పింది. JDSF, ఇండిపెండెంట్లు 5-13 సీట్లు సాధించే అవకాశం ఉందని తెల్పింది. ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ ఇంకా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది పీపుల్స్ పల్స్‌.బీహార్‌కు తదుపరి సీఎం తేజశ్వి యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని 36శాతం మంది చెప్పగా..నితీష్ కుమార్ వైపు 34శాతం మంది మొగ్గు చూపినట్లు పీపుల్స్‌ పల్స్ సర్వే తెల్పింది..ఎన్నికల ప్రచారంలో నితిశ్ చేయిన భావోద్వేగ వ్యాఖ్యలు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వే తేల్చేసింది..అదే సమయంలో తేజశ్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయని, 10లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను ఆకట్టుకుందని వివరించింది. ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపినట్లు ఆ సర్వే చెప్పింది..ఈ ఎన్నికల్లో రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ప్రభావం పెద్దగా ఉండని పీపుల్స్ సర్వే అభిప్రాయపడింది. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించిందని వివరించింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version