వేసవిలో పరిస్థితి అదుపులోకి : బిల్ గేట్స్

-

అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుందే తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలు కావడంతో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నమోదవుతుంది అమెరికాలో. కాగా ఇటీవలే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గాలంటే ఇంకాస్త సమయం పడుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు బిల్ గేట్స్.

అమెరికాలో కరోనా విజృంభణ వచ్చే ఏడాది వేసవిలో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శరవేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి జరుగుతుందని అయితే ఆ వ్యాక్సిన్లను అనుమతి విషయంలో ఎలాంటి అవరోధాలు జరగకపోతే వేసవిలో పరిస్థితి అదుపులోకి వస్తుందని.. ఇప్పటికిప్పుడు కరోనా వైరస్ ను వ్యాక్సిన్ తో అదుపు చేయాలి అనుకుంటే వెయ్యి కోట్ల డోసులు ఎంతైనా అవసరం ఉంది అంటు అభిప్రాయం వ్యక్తం చేశారు బిల్ గేట్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version