అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

-

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..నార్పుల వైపు నలుగురు కారులో కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రేకులకుంట వద్దకు చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version