ఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు..దరఖాస్తుల ఆహ్వానం

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్,ప్రాజెక్ట్ అసిస్టెంట్ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.మొత్తం పోస్టుల సంఖ్య – 26గా నిర్ణయించారు. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ను CSIR-IICT వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ధృవీకరించబడిన సంబంధిత సర్టిఫికెట్ (మెట్రిక్/10వ తరగతి, ఇంటర్, పీజీ, NET/GATE తదితర సర్టిఫికెట్లు, కేటగిరీ/కులం వారిగా రిజర్వేషన్ సర్టిఫికెట్స్‌లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది.వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు సంబంధించిన తేదీని సెప్టెంబర్ 27,30 -2024 గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: https://www.iict.res.in సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version